చీమ ప్రేమ.. మధ్యలో భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో అత్యంత అల్ప ప్రాణి చీమ. అది మనిషిగా మారాలనుకుంది. అవతారం మార్చడం దానికి సాధ్యమైందా? ఏం జరిగింది? ఆ భావన ఎలా ఉంటుంది? పైగా దానికి ప్రేమ, శృంగారం తోడైతే.. అదెలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు -‘చీమ ప్రేమ మధ్యలో భామ’లో దొరుకుతాయట. మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై శ్రీకాంత్ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తోన్న చితం -చీమ ప్రేమ మధ్యలో భామ. అమిత్, ఇందు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ -ఇదొక యువజంట ప్రయాణం. కుటుంబ విలువలతో, కామెడీ సన్నివేశాలతో మంచి సినిమా నిర్మించాం. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్టవుతుందన్న నమ్మకంతో ఉన్నాం. మ్యూజిక్, గ్రాఫిక్స్ సినిమాకే హైలెట్ అన్నారు. నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ -ఈ సినిమాలో చీమ ప్రధాన ఆకర్షణ. గ్రాఫిక్స్ బాగా వచ్చాయి. కొత్తవాళ్లే అయినా ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ సినిమా తీశాం. సెన్సార్ పూర్తి చేసి సెప్టెంబర్‌లో సినిమాను థియేటర్లకు తేనున్నాం అన్నారు.