తెరపైకి మరో క్రైం థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిత శే్వత, రాశి, శివ కంఠమనేని ప్రధాన పాత్రధారులుగా లైట్‌హౌస్ సినిమా మ్యాజిక్ పతాకంపై కొత్త సినిమా మొదలైంది. సంజీవ్ మెగోట దర్శకుడు. హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో, ముహూర్తపు సన్నివేశానికి కె అశోక్‌కుమార్ క్లాప్‌నిచ్చారు. విజయ్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చంద్రసిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -సరికొత్త క్రైం థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కించనున్నాం. కథే మా హీరో. తెలంగాణ యువతి లక్కీ కథ ఇది. ఆమె ఇక్కడి ప్రాంతీయ పరిస్థితులకు తగ్గట్టుగా చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చింది చేసే తెగువవున్న అమ్మాయిగా పెరుగుతుంది. కానీ, ఆమెకు అనుకోని సమస్య ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె దాన్ని అధిగమించడానికి యుద్ధానికి దిగిందా? లేక తల్లి చెప్పినట్టు శాంతంగా వ్యవహరించిందా? అన్నది కథాంశం. దేవకి పాత్రలో రాశి కనిపించనున్నారు. క్రిమినాలజీ ప్రొఫెసర్ పాత్రను శివ కంఠమనేని పోషిస్తున్నారు. నేరాలకు పాల్పడే సమయంలో నేరస్థుల ఆలోచనలు ఎలా ఉంటాయి? అన్న దానిపై పరిశోధన చేస్తూ, పోలీసులకు వారధిలా నిలిచే పాత్ర అన్నారు. శివ కంఠమనేని మాట్లాడుతూ ‘నిర్మాతగా వ్యవహరిస్తూనే, సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నా. రెండు షెడ్యూల్స్‌లో 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. సినిమాలోని ఐదు పాటలు ఆకట్టుకుంటాయి అన్నారు. నందితా శే్వత మాట్లాడుతూ -ఎక్కువగా నాయికా ప్రాధాన్య చిత్రాల్లోనే నటించా. తొలిసారి గ్లామర్ పాత్రలో లక్కీగా కనిపిస్తా అన్నారు. రాశి మాట్లాడుతూ -విరామం తర్వాత మంచి పాత్రతో తెరపైకి వస్తున్నా. లక్కీ తల్లి దేవకిగా కనిపిస్తా. వైవిథ్యమైన కథ ఇది అన్నారు. అన్నపూర్ణ, రాంబాబు, అంజన్, సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.