మనోళ్లు.. మారారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అపప్రదను టాలీవుడ్ చాలాకాలంగానే మోస్తోంది. ఇండస్ట్రీ పెద్దలే అనేక సందర్భాల్లో అనేక వేదికలపై -నర్మగర్భంగా ప్రస్తావిస్తోన్న సంగతి మర్చిపోకూడదు. నిజానికి -వాళ్ల వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. 80వ దశకంనుంచే తెలుగు పరిశ్రమలో ‘కాపీ క్యాట్లు’ మొదలైంది. అప్పట్లోనే గొప్ప దర్శకులు చాలామంది -పరభాషా కథలను ఎత్తేసిన సందర్భాలున్నాయి. కాకపోతే, కథలోని సారాన్ని తీసుకుని నేటివిటీకి అనుగుణంగా మలుచుకుని తెరకెక్కించేవారు. పొరబాటున ఆ విషయం చర్చకొస్తే ‘ఫలానా సినిమాకు ఇన్‌స్పిరేషన్’ అన్న డైలాగ్ వదిలేవారు. తరువాతి కాలంలో ఇన్‌స్పిరేషన్ మాటే పోయింది. ప్రపంచానికి పెద్దగా పరిచయంలేని మంచి కథను కాపీ కొట్టడం, సొంత కథగా తెరకెక్కించేసిన బాపతు చిత్రాలకు లెక్కేలేదు. జపాన్ సినిమా ఇకినాయ్ నుంచి మీశ్రేయోభిలాషి చిత్రం పుట్టుకొస్తే, ది ఫైటర్ ఫ్రమ్ ది వాలెట్ అనే ఫ్రెంచ్ సినిమా నుంచి బ్రూస్లీ పుట్టుకొచ్చిందన్న కథనాలు మర్చిపోలేం. పే ఇట్ ఫార్వార్డ్ నుంచి స్టాలిన్, వాకింగ్ టాల్ నుంచి సరైనోడు, సౌత్ కొరియన్ సినిమా ఏ మిలియనీర్స్ ఫస్ట్ లవ్ నుంచి పిల్ల జమీందార్, జస్ట్ లైక్ హెవెన్ నుంచి ఎందుకంటె ప్రేమంట చిత్రాలు పుట్టుకొచ్చాయంటూ -ఆడియనే్స చెప్పశారు. ఇదంతా గతం.
ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. టాలీవుడ్ విస్తృతమవుతోన్న నేపథ్యంలో ‘అపవాదు’ ఎదుర్కోవడం కంటే అసలు విషయాన్ని ముందే చెప్పడం బెటరన్న ధోరణి కనిపిస్తోంది. మేకర్స్, డైరెక్టర్స్, స్టార్ హీరోలు.. ఇలా ఈ జనరేషన్ ఇండస్ట్రీ జనం.. పక్కాగా ముందే విషయం చెప్పేస్తుండటం గొప్ప పరిణామం. ఆ మధ్య అక్కినేని నాగార్జున, కార్తి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊపిరి’ చిత్రానే్న తీసుకుందాం. తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకు మాతృక ఓ ఫ్రెంచ్ సినిమా అంటూ చిత్రబృందం ముందే ప్రకటించింది. రీమేక్ అనుమతి తీసుకునే ‘ఊపిరి’ తెరకెక్కించామని అప్పట్లో నాగార్జున సైతం ప్రకటించాడు. ఈమధ్య మరో ఫ్రెంచ్ సినిమా కథనూ నాగార్జున -మన్మథుడు 2గా తెరకెక్కించాడు. ‘ఐ డు’ కథ నచ్చటంతో తన వయసుకు తగిన పాత్రగా భావించి రీమేక్ రైట్స్ తీసుకుని సినిమా చేస్తున్నట్టు విడుదలకు ముందే ప్రకటించాడు. ఆమధ్య సమంతను లీడ్‌రోల్‌లో చూపిస్తూ దర్శకురాలు నందినిరెడ్డి తెరకెక్కించిన ‘ఓ బేబీ’ సైతం సౌత్ కొరియన్ సినిమాకు రీమేక్. ‘మిస్ గ్రానీ’ చిత్రానికి రీమేక్ రైట్స్ తీసుకుని ‘ఓ బేబీ’ సినిమాను తెరకెక్కించినట్టు నందినిరెడ్డి సినిమాకు ముందే ప్రకటించారు. తాజాగా అడవి శేష్ హీరోగా కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించిన చిత్రం ఎవరు? క్రైమ్ థ్రిల్లర్‌గా స్పానిష్‌లో తెరకెక్కిన ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ కథను రీమేక్ రైట్స్ తీసుకుని నేటివిటీకి అనుగుణంగా మలచుకున్నట్టు చిత్రబృందం ముందే ప్రకటించింది. అయితే, కోల్డ్ స్టోరీని నేటివిటీకి అనుగుణంగా మార్చి ఎమోషనల్ డ్రైవ్‌లో చూపించటంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది. మాతృకను యథాతథంగానో, నేటివిటీకి అనుగుణంగానో మార్చుచేసి చేస్తోన్న విదేశీ కథలు ఆడియన్స్‌కి బాగానే కనెక్టవుతున్నాయి. ఊపిరి, ఓ బేబీ, ఎవరు? చిత్రాలే అందుకు ఉదాహరణ. మన్మథుడు 2కి డివైడ్ టాక్ రావడానికి అనేక కారణాలున్నాయి. అది వేరే విషయం. ఇంతకూ విషయమేంటంటే -పరాయి దేశపు కథల్ని ఎత్తేస్తే ఎవరడుగుతారులే అన్న దృక్ఫథం వదిలేసి నిజాయితీగా ‘రీమేక్’ రైట్స్ తీసుకోవడం గొప్ప మార్పు. ‘వీళ్లు కాపీ క్యాట్స్’ అని వేలెత్తి చూపించుకునేకంటే, రీమేక్ రైట్స్‌తో ఫ్రీస్టయిల్ సినిమా చేద్దామన్న కొత్త ఆలోచనల్ని ఆహ్వానించాలి. శుభపరిణామంగా భావించాలి.

-‘వి’