రాజకీయ రుద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా అజిత్ క్రియేషన్స్ పతాకంపై బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో పి.రాజశేఖరరెడ్డి రూ పొందించిన చిత్రం ‘రుద్ర ఐ.పి. ఎస్.’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రుద్ర చిత్రాన్ని రూ పొందించామని, అవినీతిని, అక్రమాలను అరికట్టే పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా రాజ్‌కృష్ణ యాక్షన్ హైలెట్‌గా వుంటుందన్నారు. స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రంగా రూపొందిన ఇందులో సంగీతం అందరికీ నచ్చుతుందని ఆయన తెలిపారు. మంచి కథతో రూపొందిస్తున్న ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిస్తున్న ఈ సినిమాను త్వర లో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్:విజయ్‌కృష్ణ, ఎడిటింగ్:నందమూరి హరి, కెమెరా:వంశీకృష్ణ, సంగీతం:ఘంటాడి కృష్ణ, నిర్మాత:టి.రాజేశేఖర్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:బాలకృష్ణారెడ్డి.