ధైర్యాన్నిచ్చిన గుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, అనఘ హీరో హీరోయిన్లుగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -గుణ 369. ఆగస్టు 2న విడుదలైన సినిమాను అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మించారు. తాజాగా నిర్వహించిన సినిమా సక్సెస్ మీట్‌లో హీరో కార్తికేయ మాట్లాడుతూ -సినిమా హిట్ అయింది అనేదానికన్నా నాకు బాగా నచ్చిన సినిమా. విడుదల తరువాత వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే, భవిష్యత్తులో మంచి సినిమాలను ఇవ్వగలననే ధైర్యాన్నిచ్చింది. ఆ ధైర్యాన్ని నాలో నింపినందుకు దర్శకుడికి ధన్యవాదాలు. ఇకపై నేను ఎంపిక చేసుకునే కథల మీద ఈ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది. సినిమా నాకు జీవితాం గుర్తుండిపోయే చిత్రం. సినిమా పూర్తయ్యాక కొందరు మహిళలు నన్ను పట్టుకుని ఏడిస్తే, వాళ్లు ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమైంది. హీరోయిన్ అనఘ ఇలాంటి పాత్రను పోషించినందుకు గర్వపడుతోంది. నా అభిమానుల నమ్మకాన్ని వమ్ముచేయను అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ -తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కర్నూలు నుంచి వైజాగ్ వరకు దాదాపు అన్ని థియేటర్లకూ వెళ్లాం. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నామన్నారు. కార్తికేయ ఫర్ఫార్మెన్స్‌ను అప్రీషియేట్ చేస్తున్నారు. మంచి సినిమా అవుతుందని ప్రవీణ బాగా నమ్మారు. నమ్మకం నిజమైంది అన్నారు. నిర్మాత ప్రవీణ్ కడియాల మాట్లాడుతూ -సినిమాను గుండెల్లో పెట్టుకుని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. గుణ 369కి ఆడియన్స్ నుంచి వస్తున్న సపోర్టు చూస్తుంటే ఆనందంగా ఉంది అన్నారు.