లక్కీ ఛాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ రాశిఖన్నా లక్కీ ఛాన్స్‌కొట్టేసింది. ఇప్పటివరకు ఆమె పెద్దగా స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. అయితే రవితేజ, గోపీచంద్ లాంటి హీరోలతోనే సరిపెట్టుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు లక్కీ ఛాన్స్ దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే.. అల్లుఅర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఎంసిఏ ఫేమ్ వేణుశ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఐకాన్ పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేశారట! ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుతున్నాడు వేణుశ్రీరామ్. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలవుతుందట. ప్రస్తుతం ఆమె నాగచైతన్యకు జోడీగా వెంకీమామ సినిమాలో నటిస్తుంది.