అందుకే.. నిర్మాతగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, అన్యాసింగ్ జంటగా కార్తీక్ రాజు దర్శకత్వంలో వెంకటాద్రి సినిమాస్, వి స్టూడియో, విస్టా డ్రీమ్‌మర్చంట్ బ్యానర్లపై తెరకెక్కిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా హీరో సందీప్ కిషన్‌తో ఇంటర్వ్యూ...
హారర్ నేపథ్యంలో..
నాకు హారర్ సినిమాలు చూడడం చాలా ఇష్టం. అయితే అలాంటి సినిమాల్లో నటించేందుకు మాత్రం ఆసక్తిలేదు. ఎందుకంటే, అందులో నటించేందుకు ఏ మాత్రం స్కోప్ వుండదని నా ఫీలింగ్. అందుకే ఇప్పటివరకూ హారర్ జోనర్‌ను టచ్ చేయలేదు. కానీ ఈ కథ విన్నపుడు చాలా కొత్తగా అనిపించింది. తప్పకుండా ప్రేక్షకులు కూడా ఓ కొత్త థ్రిల్లర్ సినిమాను చూస్తారనిపించి చేశాను.
యూనివర్సల్ జోనర్..
హారర్ అనేది యూనివర్సల్ జోనర్. ఈ నేపథ్యంలో ఏ సినిమా తీసినా చూడ్డానికి జనాలు వస్తారు. అయితే ఎలాంటి కంటెంట్‌ను చెబుతున్నామా అనేది ముఖ్యం. ఎక్కడికి పోతావు చిన్నవాడా, గృహం, ప్రేమకథా చిత్రమ్.. ఇలా ఏ యాంగిల్‌లో తీసినా హిట్ అవుతోంది. ఇది కామెడీ కోసం చేసే సినిమా కాదు. కానీ కామెడీ వుంటుంది. ఎందుకంటే నాకు అద్దంలో కనిపించేది వెనె్నల కిశోర్.. అంటే కామెడీ ఎలావుంటుందో ఊహించుకోండి. ముఖ్యంగా పోసాని కామెడీ అదరగొట్టాడు.
అందుకే నిర్మాతగా..
ఈ కథ విషయంలో హారర్ జోనర్ అంటూ దర్శకుడు కధ చెప్పలేదు. ఒక కొత్త పాయింట్ వుంది అని చెప్పడంతో కథ విన్నాను. అది ఫైనల్ హారర్ జోనర్ అయింది. ఇక నిర్మాతగా మారడానికి ముఖ్య కారణం, గత రెండేళ్లలో నా సినిమాలేవీ ఆడలేదు. నక్షత్రం తరువాత నన్ను నేను వెండితెరపై చూసుకోలేదు. అయితే నా సినిమాల విషయంలో ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునేసరికి సినిమా రిలీజ్ అయిపోయేది. దాంతో చేసేదేమీ లేక ఫ్లాప్‌లను చవిచూశాను. అదే సినిమాకు ముందే లోపాలను పసిగట్టి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో నిర్మాతగా మారా.
మంచి అనుభవం
హీరోగా ఇప్పటికే పాతిక సినిమాలు చేశాను కాబట్టి నటుడిగా నాకు తెలిసిన జాబే.. కానీ నిర్మాతగా మొదటిసారి చేస్తున్నాను. ప్రొడక్షన్ విషయంలో చాలా హ్యాపీగా వున్నాను. టీమ్ అందించిన సహకారంతో సక్సెస్‌ఫుల్ పూర్తిచేశాం. ముఖ్యంగా దయా పనె్నం, అనీల్ సుంకర, జెమిని కిరణ్‌ల సహకారం మరువలేనిది.
నీడ ఎవరన్నదే..
సినిమాలో నన్ను నేను అద్దంలో చూసుకున్నపుడు వెనె్నల కిశోర్ కనిపించడం ఏమిటనేదే ఆసక్తి కలిగిస్తుంది. దాంతోపాటు సినిమాలో మరో దెయ్యం కూడా వుంటుంది. ఈ రెండు సంఘటనలమధ్య ఏం జరిగిందన్న ఆసక్తికర కథే సినిమా.
తదుపరి చిత్రాలు
ఇటీవలే హిందీలో ఓ వెబ్ సిరీస్ చేశా. ది ఫ్యామిలీ మాన్ టైటిల్‌తో తెరకెక్కింది. మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి నటించా. దాన్ని తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తారు. దాంతోపాటు నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ మరో 20 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత మరో ప్రాజెక్టు వుంటుంది. త్వరలోనే దాని గురించి తెలియజేస్తా.

-శ్రీనివాస్ ఆర్ రావ్