ఆ స్వేచ్ఛ నాకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరియన్ ‘మిస్ గ్రానీ’.. సౌత్ ఆడియన్స్ కోసం ‘ఓ బేబీ’గా ప్రత్యక్షం కాబోతోంది. సమంత ముఖ్యపాత్రలో నందినిరెడ్డి తెరకెక్కించిన సినిమా
-ఓ బేబీ. రీమేక్‌గా వస్తోన్నప్పటికీ,
సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంలో -మీడియాతో ఈ బేబీ ముచ్చట్లు.

నా కెరీర్‌లో ఓ ప్రత్యేక చిత్రం -ఓ బేబీ. అందిరకీ కనెక్టయ్యే మంచి కథలో కనిపించాలన్న తాపత్రయం వుంది. అందుకే ఈ ‘బేబీ’పై ఎక్కువ కేర్ తీసుకున్నా.
మజిలీ విషయంలో ఎంత ఫోకస్‌తో ఉన్నానో, ఈ ప్రాజెక్టుపైనా అలానే ఉన్నా. కారణం -మజిలీ పెళ్లయ్యాక చేసిన సినిమా. అదీ చైతూతో కలిసి. అందుకే కాస్త ఎక్కువ బాధ్యత తీసుకోక తప్పలేదు.
చైతన్య సినిమాల విడుదల టైంలోనే నేను తిరుపతికి వెళ్లేదాన్ని. కానీ ఇపుడు నా కెరీర్‌లో తొలిసారి నా సినిమా కోసం తిరుపతి వెళ్ళాను. మాములుగా సినిమా బాగా వచ్చింది. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటివారైతే థియేటర్స్‌కు జనాలు ఆటోమేటిగ్గా వచ్చేస్తారు. ఎంత స్టార్ హీరోయిన్ అయినా థియేటర్‌కు జనాలను రప్పించడం మామూలు విషయం కాదు. అందుకే నావంతు నేను విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నా. థియేటర్‌కు వచ్చినవారికి మాత్రం తప్పకుండా నచ్చే సినిమా ఇది. ఎందుకంటే టీజర్, ట్రైలర్ ఇప్పటికే అందరికీ నచ్చింది.
మామూలుగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనగానే థ్రిల్లర్ చిత్రాలో, మెసేజ్ ఓరియెంటెడ్ కథలో వస్తాయి. కానీ ఇందులో మెసేజ్ ఉంటుంది. అయితే అది పూర్తిగా కామెడీతో మనసుకు హత్తుకునేలా సాగుతుంది. అందుకే ఈ సినిమా నాకు స్పెషల్.
మామూలుగా రీమేక్‌లు చేయడం వేరు. ఇలాంటి చిత్రాలను రీమేక్ చేయడానికి సిద్ధపడటం వేరు. ‘మిస్ గ్రానీ’కి అధికారికంగా ఇది ఏడో రీమేక్. అందుకే చాలా జాగ్రత్తగా చేశాం. సినిమా హక్కులు తీసుకుని, వాళ్లకు తగ్గట్టు చుట్టేశారన్న భావన రాకుండా, ఒరిజనల్‌కు దెబ్బతగలకుండా, ప్రతి సన్నివేశం అంతరార్థాన్ని తెలుసుకుని మరీ చిత్రీకరించాం.
నాకు ఎమోషనల్ సీన్స్, రొమాన్స్, డ్రామాలకున్న రిథిమ్ బాగా తెలుసు. అయితే కామెడీ రిథిమ్ తెలీదు. కామెడీ చూడటం, చూసి నవ్వడం తేలికే. కానీ సాయంత్రమయ్యేసరికి కామెడీ చేసినవాళ్లు డ్రెయిన్ అయిపోతారు. ఆ విషయం నాకు ఈ సినిమాతో అర్థమైంది.
రాజేంద్రప్రసాద్ నాకు చాలా టిప్స్ నేర్పించారు. కామెడీ సీన్ చేసేటప్పుడు పంచ్‌తో ల్యాండయ్యే విషయాలన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవే.
నాకు నానమ్మ, అమ్మమ్మలతో పెరిగిన జ్ఞాపకాలు లేవు. అందుకే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు వెళ్లా. వాళ్లతో సమయం గడిపా. వయసు పెరిగే కొద్దీ వారు చిన్నపిల్లలైపోవడాన్ని గమనించాను. అది నాకు చాలా సాయపడింది. సీనియర్ నటి లక్ష్మితో నాకు ఎలాంటి సీన్స్ లేవు. అయితే ఒకరోజు మాత్రం ఆమె అడుగులో అడుగు వేసినంత జాగ్రత్తగా అనుసరించాను. ఆమె హావభావాలను ఆకళింపు చేసుకున్నా.
నందిని నాకు చాలా రోజులుగా తెలుసు. ఓ బేబి తరహా వ్యక్తి ఆమె. ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉన్నప్పటికీ ఆమె ఎంతో ప్యూర్ హార్ట్‌తో ఉంటుంది. ఇక లేడీ డైరెక్షన్ అంటారా? భవిష్యత్తులోనైనా కనీసం ఇలాంటి జెండర్ తేడాలు రావనే అనుకుంటున్నా. చాలా జెన్యూన్‌గా చేసింది. కేపబులిటీ వున్నవారికే ఇక్కడ అవకాశాలు వస్తాయి. వాటిని వాళ్లు నిలబెట్టుకుంటారు. ఈ ప్రాజెక్టుకు ఏడుగురు అమ్మాయిలు పనిచేశారు. అమ్మాయిలు చేస్తున్నపుడు ఎలాంటి తేడా రాకూడదని ఇంకా జాగ్రత్తలు తీసుకున్నాం.
కటౌట్లదేముంది? కలెక్షన్లు రావాలిగానీ. యు టర్న్ సినిమా చాలా బావుందన్నాఃరు. కానీ కలెక్షన్లు అనుకున్నంత రాలేదు. ఈ సినిమాకు మాత్రం కలెక్షన్లు రావాలి.
అందులో ఏముంది? నేను కూడా నా ఫ్రెండ్స్‌ని పిల్లల గురిం ఏం ప్లాన్ చేసుకున్నారని అడుగుతా. భగవంతుడి దయవల్ల నేను స్వతంత్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఈ ఏడాది పిల్లలువద్దని చెప్పగలుగుతున్నా. ఆ పరిస్థితి మన అమ్మకో, అమ్మమ్మకో ఉండేదా? వాళ్లకసలు జీవితంలో ఎలాంటి కోరికలు ఉండేవి? వాటిని నెరవేర్చడానికి వారు ఎప్పుడైనా ప్రయత్నించారా? వంటి ప్రశ్నలన్నీ మనకు ఓ బేబి చూశాక కలుగుతాయి.
దర్శకత్వం ఆలోచనలు లేవు. కానీ, సినిమాలు నిర్మిస్తా. మహిళా ప్రాధాన్యతవున్న కంటెంట్‌తో సినిమాలు నిర్మిస్తా. నిజానికి నాకు రీమేక్‌ల దశ నడుస్తోంది. అంతేగానీ రీమేక్ చేయాలని అనుకోవడంలేదు. ప్రస్తుతం 96 సెట్స్‌మీద వుంది. మన్మథుడు-2లో చిన్న పాత్రలో చేశా. మిగిలిన సినిమాలు త్వరలో అనౌన్స్ చేస్తా.