అదంతా రూమర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వండర్ బార్’ మూతపడిందంటూ వస్తున్న కథనాల్లో ఎంతమాత్రం వాస్తవం లేదంటున్నాడు హీరో ధనుష్. ఇదే బ్యానర్‌పై మామ రజనీకాంత్‌తో ‘కాలా’ను తెరకెక్కించాడు ధనుష్. బాక్సాఫీస్ వద్ద సినిమా బోర్లా పడటంతో -మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కాలాతో కోలుకోలేని దెబ్బతిన్న ధనుష్, సెంటిమెంట్‌గా నిర్మాణ సంస్థను మూసేయాలన్న యోచనలో ఉన్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఖండించిన ధనుష్ -రజనీతో మరో కొత్త ప్రాజెక్టు ప్రకటించకపోవడం వల్ల ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఏడాదికి ఒకట్రెండ్ సినిమాలు చేస్తే -నిర్మాణ సంస్థలు మూసేసినట్టేనా. కథపై సాగుతోన్న కసరత్తులు కొలిక్కివస్తే త్వరలోనే తదుపరి ప్రాజెక్టు ప్రకటిస్తాం. వండర్ బార్ బ్యానర్‌పై చెప్పుకోదగ్గ చిత్రాలు వచ్చిన విషయాన్ని ఇక్కడ మరువకూడదు. మంచి స్క్రిప్ట్ దొరికితే -రజనీని సంప్రదించటానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాడు ధనుష్.