ఆర్మీ ఆపరేషన్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చంద్రహాస్’తో నటుడయ్యారు హరినాథ్ పొలిచెర్ల. తాజాగా డ్రీమ్ టీమ్ బ్యానర్‌లో ఏ జవాన్ స్టోరీగా హరినాథ్ నటించిన చిత్రం -కెప్టెన్ రాణాప్రతాప్. జూన్ 28న సినిమా విడుదలవుతోన్న సందర్భంలో మీడియాతో ముచ్చటించారు హరినాథ్.
పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్నారు?
దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అంశాన్ని తీసుకుని, మిలటరీ ఆఫీసర్లు నిర్వహించే కోవర్ట్ ఆపరేషన్ బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్న కథ ఇది. యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కింది.
కథకు సంబంధించి రీసెర్చ్ చేశారా?
పరిచయస్తులైన ఆర్మీ అధికారులు అందించిన సమాచారం, పత్రికలు, అంతర్జాలంలో అందుబాటులోవున్న సమాచారంతో కథను సిద్ధం చేసి షూటింగ్ నిర్వహించాం.
మీ పాత్ర ఇంటెన్సిటీ..
కెప్టెన్ రాణాప్రతాప్‌గా టైటిల్ రోల్ చేస్తున్నా. దాయాది దేశమైన పాకిస్తాన్‌కు అనుకోకుండా వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లిన మిలటరీ ఆఫీసర్ అక్కడ ఏం చేశాడన్నదే కథ.
అలాంటి సంఘటనలు..?
ఇటీవలి కాలంలో ఆర్మీ పైలెట్ అభినందన్ పాక్‌కు చిక్కి, సురక్షితంగా మళ్లీ భారత్‌కు చేరుకున్నాడు. ఇది జరిగి కొన్ని నెలలే కావొచ్చు, కానీ నేను ఈ కథను రెండేళ్ల క్రితమే సిద్ధం చేశాను.
మీరే హీరోగా..
ఆర్మీ ఆఫీసర్ పాత్రకు బాడీ ఫిట్‌నెస్ ఉండాలి. కొంతకాలంగా నేను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫిట్ బాడీతో ఉన్నాను కనుకే, ఈ పాత్రను చేశాను.
డాక్టర్ కమ్ యాక్టర్ ఎలా సాధ్యం?
ఔను, నేను డాక్టర్‌నే. లైఫ్‌లో ఫిప్టీ పర్సెంట్ టైమ్‌ని వృత్త్ధిర్మానికి కేటాయిస్తున్నా. మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ నా ప్రవృత్తికి కేటాయిస్తున్నా. అలా రెండూ బ్యాలెన్స్ చేస్తున్నా.
దర్శకుడు.. నిర్మాత.. !
నటనంటే ప్రాణం. ఆ నటుడిని సంతృప్తిపర్చాలంటే అంతే విజన్‌వున్న దర్శకుడుండాలి. కాంప్రమైజ్ కాని నిర్మాత అవసరం. అందుకే నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నేనే నిర్వహిస్తున్నా.
సుమన్ పాత్ర?
ఎక్కువగా పోలీసు అధికారి, మేజర్ పాత్రలు చేసిన సుమన్, కథలో ఈ పాత్ర వినగానే ఒప్పుకున్నారు. నన్ను లీడ్ చేసే మేజర్ పాత్ర ఆయనది. క్లైమాక్స్‌లో ఆయన యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. సినిమాకు అదే ప్లస్.