చదువుండీ.. బుద్ధిలేకుంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంజునాథ్ వి కందకూర్ నిర్మిస్తోన్న చిత్రం -ఫస్ట్‌ర్యాంక్ రాజు. దర్శకుడు నరేష్‌కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో చేతన్ మద్దినేని, కౌశిష్ ఓరా హీరో హీరోయిన్లు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో, జూన్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మంజునాథ్, ఐఎన్ శరవణ్ మాట్లాడుతూ టీజర్, ఆడియోకు మంచి స్పందన వచ్చిందని, 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేస్తున్నామన్నారు. హీరోయిన్ కౌశిష్ మాట్లాడుతూ సినిమా అన్ని వర్గాలను ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకం ఉందని, తప్పకుండా సినిమాను ఆదరించాలని కోరారు. దర్శకుడు నరేష్ మాట్లాడుతూ మ్యాథమెటికల్ ఈక్వేషన్‌లాంటి కథ ఇదని, ఒక వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ చదువుండి బుద్ధి జీరో పర్సంట్ ఉంటే ఎలా ఉంటాడో చూపించే కథ ఇది అన్నారు. అలాంటి వ్యక్తికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటాడో చూపిస్తున్నట్టు చెప్పారు. రెండు రోజుల్లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. హీరో చేతన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క లైఫ్‌లో ఒక ఫస్ట్‌ర్యాంకర్ ఉంటాడు. నేనూ ఒకప్పుడు ఫస్ట్ ర్యాంకర్‌నే అన్నారు. చిన్న సినిమాలు విడుదల కావు అన్నది పెద్ద ట్రాష్ అని, కంటెంట్ బావుంటే సినిమా చిన్నదైనా థియేటర్ల వరకూ వస్తుందన్నారు. తనకు అన్నివిధాలా సహకరించిన దర్శకుడు మారుతికి కృతజ్ఞతలు తెలిపారు. 21న థియేటర్లలో ఈ వైవిధ్యమైన చిత్రాన్ని చూసి మార్కులు వేయాలని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేశారు.