టీజర్‌లో శివలింగాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ మలయాళ భాషల యాక్షన్ హీరో ఆర్‌కె సురేష్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్న చిత్రం -శివలింగాపురం. రావూరి వెంకటస్వామి నిర్మాణంలో దర్శకుడు తోట కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మధుబాల కథానాయికగా నటిస్తోంది. చిత్రం ఆడియో, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు -సమాజ సేవకుడిగా పేరొందిన రావూరి తీస్తున్న సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి మంచి సినిమాలు విరివిగా రూపొందినపుడు పరిశ్రమను నమ్ముకున్న వారికి పని దొరుకుతుందన్నారు. మరో అతిథి టి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఒకప్పటి భక్త సిరియాళ మాదిరిగా శివలింగాపురం ఆడియన్స్‌ను అలరించాలని ఆకాంక్షించారు. నిర్మాత రావూరి మాట్లాడుతూ గతంలో లిటిల్ హార్ట్స్, మా తల్లి గంగమ్మ కొక్కోరొక్కో చిత్రాలు తీశామని, ఈ శివలింగాపురం చిత్రం కూడా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో హీరో ఆర్‌కె సురేష్, ప్రతినాయక పాత్రధారి తదితరులు మాట్లాడారు.