ఊరికోసం.. ఈ గోవింద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ సప్తగిరి మరోసారి హీరోగా చేస్తున్న వైవిధ్యమైన చిత్రం -వజ్రకవచధర గోవింద. అరుణ్‌పవార్ దర్శకత్వంలో నరేంద్ర ఎడ్లా, జివిఎన్ రెడ్డి నిర్మించిన చిత్రంలో సప్తగిరికి జోడీగా వైభవిజోషి నటిస్తోంది. దేవుడికి సప్తగిరికీ మధ్య నడిచే చిన్న ఎమోషనల్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం జూన్ 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో హీరో సప్తగిరి మాట్లాడుతూ -ఇదొక చిన్న బడ్జెట్ సినిమా. మంచి రెస్పాన్స్ సాధించగలగడమే మా విజయం. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బి.. ఒకటి హిట్టయితే, ఒకటి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా నాకు పేరు, డబ్బూ రెండూ తెస్తుందన్న నమ్మకంతో ఉన్నా. వజ్రకవచధర గోవిందను అందరూ ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్నాను అన్నారు. నిర్మాతలు సినిమా విశేషాలు చెబుతూ ‘ఊరి ప్రజలను సప్తగిరి ఏవిధంగా కాపాడాడన్నదే ప్రధాన ఇతివృత్తం’ అన్నారు. సప్తగిరి లేకపోతే తాము లేమని, సప్తగిరి ప్రాణం పెట్టి చేసిన సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టులో పని చేసిన ఆర్టిస్టులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా మార్కెట్‌కి తమను పరిచయం చేసి, సీడెడ్ రైట్స్ సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు అరుణ్‌పవార్ మాట్లాడుతూ -ప్రాజెక్టులో ప్రావీణ్యమున్న కమెడియన్స్ మంచి పాత్రలు పోషించారు. బడ్జెట్‌ను లెక్కచేయకుండా నిర్మాతల అందించిన సహకారం మర్చిపోలేను. మంచి ఎమోషన్‌తో తీసిన ఒరిజినల్ రెయిన్ సాంగ్‌ని ఆడియన్స్‌ని అలరిస్తుంది. మనం వెళ్లే మార్గం మంచిదైనపుడు అన్ని శక్తులూ మనకు సహకరిస్తాయన్న నమ్మకం ఈ ప్రాజెక్టుతో కలిగింది. అన్ని వర్గాలను అలరించే మంచి సినిమా తీశాం. దర్శకుడిగా నాకు మంచి ఫ్లాట్‌ఫామ్ ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.