లక్ష్మీగా వస్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియల్ ఇన్సిడెంట్స్‌ని స్క్రీన్‌కి ఎక్కించడంలో బాలీవుడ్‌కు ఎక్కడలేని కిక్కొస్తుంది. ఏదోక చిన్న ఇన్సిడెంట్‌ని తీసుకుని రెండున్నర గంటల కథగా అద్భుతంగా మలిచేందుకు దర్శకులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ విషయంలో రెండడుగులు ముందుకేసిన దీపికా పదుకొనె వైవిధ్యమైన పాత్రను చేస్తూ సాహసం చేస్తోంది. అదే ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్ర. దీపిక ఈ కథకు ఒకే చెప్పడం దగ్గర్నుంచే బాలీవుడ్‌లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. అలాంటి -చపాక్ సినిమా విడుదలకు ముహూర్తాన్ని నిర్ణయించేశారు. ‘సాహసోపేత మహిళ లక్ష్మీ అగర్వాల్‌గా జనవరి 10న నన్ను చూడండి’ అంటూ దీపిక ఓ ట్వీట్ చేసింది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి దీపికాపదుకొనే కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. ‘ఇది నా కెరీర్‌లో అత్యుత్తమమైన సినిమా. జనవరి 10, 2020న లక్ష్మీ అగర్వాల్‌గా వస్తున్నా. చూడండి’ అంటూ ట్వీట్ చేసింది. దీపిక తాజా ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి.