సల్మాన్.. సెంటిమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఎక్కడా తగ్గడం లేదు. వరసబెట్టి సినిమాలు ఆడియన్స్ మీదకు వదులుతున్నాడు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా సల్మాన్ కొత్త సినిమా ‘్భరత్’ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. సల్మాన్‌కు ఈద్‌కు అవినాభావ సంబంధముంది. ఈద్ అంటే సల్మాన్ సినిమా రిలీజ్ ఉండాల్సిందే. ఏదోక సందర్భంలో తప్ప, దాదాపుగా రంజాన్‌కు రిలీజైన సినిమాలన్నీ సక్సెస్‌నే సాధించాయి. ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తున్నాడు సల్మాన్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇన్షా అల్లాను 2020 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామంటూ అధికారిక ప్రకటనతో పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో సల్మాన్‌ఖాన్ సరసన అలియాభట్ హీరోయిన్. చిత్రాన్ని భన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా నిర్మిస్తున్నారు.