తమిళ చూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో తన నాజూకు అందాలు ఎరవేసి కుర్రకారు గుండెల్లో తిష్టవేసిన కైరా అద్వానీ -తాజాగా తమిళంవైపూ చూపు తిప్పుతోందట. చేసినవి కొద్దిపాటి చిత్రలే అయినా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన కైరా -తమిళంలోనూ సత్తా చూపించాలన్న కసితో ఉందని అంటున్నారు. అందులో భాగంగానే తమిళంలో ఓ చాన్స్ అందుకుని -ఆ పాత్రతో ఆడియన్స్‌కు దగ్గరవ్వాలని కలలు కంటోందట. నయనతార ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమిళంలో శివకార్తికేయన్ హీరోగా ఓ ప్రాజెక్టు ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో శివకు జోడీగా కైరాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. తమిళ ఆడియన్స్ నుంచి తనకు మంచి రెస్పానే్స వస్తుందన్న నమ్మకంతో ఉందట కైరా. అయితే కైరాను కన్ఫర్మ్ చేసుకున్న విషయాన్ని చిత్రబందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.