నిద్రకు కరవయ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా? అన్న ఆలోచనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నానంటోంది బాలీవుడ్ బార్బీగాళ్ కత్రినా కైఫ్. ప్రేక్షకులకు ఈ సినిమా చూపించేందుకు ఉవ్విళ్లూరుతోందట. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన భారత్ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో కత్రినా కైఫ్ జోడీ కట్టింది. కొరియన్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న భారత్‌లో పద్దెనిమిదేళ్ల యువకుడి నుంచి 70ఏళ్ల వృద్ధుడి వరకూ వివిధ వయసు పాత్రల్లో సల్లూ భాయ్ కనిపించనున్నాడు. నేడు విడుదలవుతున్న చిత్రం కోసం చాలా కష్టపడ్డామని ఇప్పటికే సల్మాన్, కత్రినాలు వివిధ సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ప్రమోషన్స్ టైంలో ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన కత్రినా ‘్భరత్ విషయంలో చాలా ఆతృత పడుతున్నా. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలన్న ఆరాటం పెరిగిపోతోంది. అందుకోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. ఏ సినిమా విషయంలోనైనా వసూళ్లను ఎవ్వరూ ఊహించలేరు. కాకపోతే, ఈ చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణం మేం ఊహించిన దానికంటే ఎక్కువే దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాం’ అంటోంది కత్రినా. ఆడియన్స్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.