లీసా.. నాకొక స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి ప్రధాన పాత్రగా తెరకెక్కిన త్రీ డీ హారర్ చిత్రం -లీసా. రాజు విశ్వనాథ్ దర్శకుడు. ఎస్‌కె పిక్చర్ పతాకంపై సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. 24న సినిమా విడుదలవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మా మాజీ అధ్యక్షడు శివాజీరాజా ట్రైలర్‌ని విడుదల చేసి, హీరోయిన్ అంజలితో కలిసి ఆడియో బిగ్ సీడీనీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ తన కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా అన్నారు. త్రీ డీలో హారర్ సినిమా చేయడం ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చిందన్నారు. తన కెరీర్‌లో ది బెస్ట్ సాంగ్ లీసాలో ఉందని, ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందని అన్నారు. తన చిత్రాలను సురేష్ కొండేటి తెలుగులో విడుదల చేసి హిట్స్ అందుకున్నారని, ఆ తరహాలోనే ఈ సినిమాతోనూ విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు హక్కులు తీసుకున్న సురేష్ కొండేటి మాట్లాడుతూ షాపింగ్‌మాల్, జర్నీ చిత్రాలను తెలుగులో విడుదల చేయాలని అంజలి సూచించారని, ఇప్పుడు ఈ చిత్రాన్ని సైతం ఆమె సూచన మీదటే తీసుకున్నామన్నారు. హారర్ జోనర్‌లో త్రీ డీ సినిమా రావడం మంచి ఎక్స్‌పీరియన్స్ అంటూనే, తెలుగు ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు. శివాజీరాజా మాట్లాడుతూ ‘అంజలి తెలుగమ్మాయి అయివుండీ తమిళంలో రాణిస్తున్నారని, తెలుగువాళ్లం మనం ఆదరించాలి’ అన్నారు. లీసాతో సురేష్ మరో విజయాన్ని అందుకుంటాడని ఆకాంక్షించారు. దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ ‘తెలుగులో నాకు ఇది తొలి సినిమా. అంజలి టైటిల్ పాత్రలో ఆకట్టుకుంటారు. పిజి ముత్తయ్య కెమెరా, సంతోష్ దయానిధి సంగీతం చిత్రానికి హైలెట్’ అన్నారు.