24న వస్తున్న అల్లాద్దీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ కథని ఎన్నిసార్లు సినిమా తీసినా, చూసిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. అందుకే మరోసారి డిస్నీ సంస్థ ప్రస్తుత సాంకేతికతని వాడుకొని, అల్లాద్దీన్ కథని విజువల్ వండర్‌గా రెడీ చేసింది. భారీ బడ్జెట్‌తో అల్లాద్దీన్‌కి కొత్త హంగులు జోడించి ప్రేక్షకులను అరేబియన్ రాజ్యంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే డిస్నీ, మార్వెల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే. అభిమానులు ఆ మానియానుంచి బయటికి రాకుండానే డిస్నీ సంస్థ అల్లాద్దీన్ వంటి మరో అద్భుతాన్ని మే 24న థియేటర్లకు తెస్తోంది. అల్లాద్దీన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ అవుతుంది. అల్లాద్దీన్ తెలుగు వర్షన్‌లో జీనీ, అల్లాదీన్ పాత్రలకు వెంకటేష్, వరుణ్‌తేజ్ వాయస్‌ని ఇచ్చారు. సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్, అల్లాద్దీన్‌గా మేనామసూద్ కనిపిస్తారు.