ఫోర్’ కొడతాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడడుగులు ముందుకి.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టున్న అఖిల్ కెరీర్‌లో నాల్గవ ప్రాజెక్టును లాంచ్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. మే చివరి వారంలో ప్రాజెక్టును లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అఖిల్ నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఖాయనమైన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్స్ పూరె్తై చాలా రోజులవుతుండటంతో, సినిమాను సెట్స్‌పైకి ఎప్పుడు తీసుకెళ్తారా అన్న ఆసక్తి ఇండస్ట్రీలో ఉంది. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి హీరో పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న రష్మిక మండన్నను అఖిల్‌కు జోడీగా ఎంపిక చేసుకున్నట్టు వస్తోన్న కథనాలను చిత్రబృందం ఖరారు చేయడం లేదు. అఖిల్‌తో ఎవరు జోడీ కడతారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈ కారణంగానే ఫస్ట్ షెడ్యూల్‌లో లీడ్‌రోల్స్‌కు సంబంధించిన సన్నివేశాలను షూట్ ప్లాన్‌లో వేసుకోలేదని అంటున్నారు.