మత్తు ముసుగు తీస్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రొమాంటిక్ క్రైమ్‌కథ, ఒక క్రిమినల్ ప్రేమకథలాంటి మెసేజ్ ఓరియంటెండ్ కమర్షియల్ చిత్రాలతో టాలీవుడ్‌లో న్యూట్రెండ్‌ని క్రియేట్ చేసిన దర్శకుడు పి సునీల్‌కుమార్‌రెడ్డి. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం -రొమాంటిక్ క్రిమినల్స్. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ క్రైమ్‌కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకు సీక్వెల్. శ్రీ లక్ష్మీపిక్చర్స్, శ్రావ్య ఫిలింస్ బ్యానర్లపై ఎక్కలి రవీంద్రబాబు, బి బాపిరాజు సంయుక్తంగా నిర్మించారు. మనోజ్ నందం, అవంతిక, వినయ్, వౌనిక, దివ్య ముఖ్యపాత్రలు పోషించారు.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా
దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ముసుగుమాటున సమాజంలో చాలా జరుగుతుంటాయి. వాటిల్లో వ్యసనాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ముఖ్యంగా మత్తు బానిసలను యూత్‌కి కనెక్టయ్యేలా డిజైన్ చేశాం.
ఒక రొమాంటిక్ క్రైమ్‌కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ -ఇదివరకటి చిత్రాలు. ప్రతి రెండేళ్లకు ఓ సీక్వెల్ చేస్తానని చెప్పినట్టుగానే రొమాంటిక్ క్రిమినల్స్‌ని తెస్తున్నా.
సినిమా విషయంలో పలు ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో స్టూడెంట్స్ అభిప్రాయాలూ తీసుకున్నా. నేటి సమాజంలో నెగిటివిటీ పెరిగింది. ఈరోజుల్లో ప్రేమ కూడా ఓ అడిక్షన్. మత్తుకు బానిసవ్వడం, పోర్నోగ్రఫీలో మునిగితేలడంలాంటి చెడు అంశాలకు పిల్లలు ఎలా అడిక్ట్ అవుతున్నారు చూపిస్తున్నాం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో కేర్ తీసుకోవడం లేదు. అలాంటి వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్నది ఈ సినిమా సారంశం. అలాంటి తల్లిదండ్రులకు ఇదో చెంపపెట్టు.
ఇది ముగ్గురు అమ్మాయిల కథగా చెప్పాను. ముగ్గురి జీవితాలు ఎలా మారిపోయాయి, వ్యసనాల బారినపడి వారి జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారు అన్న పాయింట్‌తో కథ సాగుతుంది. బూతు కోణంలో కాకుండా, సమాజంలో జరిగే చెడును చూపించే ప్రయత్నమే చేస్తున్నా. ఇదివరకు నేను తీసిన సొంతవూరు, గంగపుత్రులు ఎంత సిన్సియర్‌గా తీశానో ఈ కథనూ అలాగే తీసా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్స్‌లో సినిమా విడుదలవుతుంది. ఇంత బిజీ టైంలోనూ మా సినిమాకు ఇన్ని థియేటర్లు దొరకడం హ్యాపీగా ఉంది. విడుదల తరువాత మరిన్ని థియేటర్లు పెరుగుతాయి.