నేను పరిగెత్తను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ -ఎంటర్‌టైనింగ్ రోల్‌లో బిజీగా ఉంది. స్క్రీన్‌మీద కాదు, ఐపీఎల్ గ్రౌండ్స్‌లో. అవును! బాక్సాఫీస్‌ను పక్కన పెట్టేసి బాక్స్‌లో కూర్చుని భర్త కోహ్లీ ఆడుతోన్న మ్యాచ్‌ల్ని ఈలలేస్తూ మరీ ఎంజాయ్ చేసింది. ‘నా భర్త పరుగులు పెడుతున్నాడు. వాటిని ఎంజాయ్ చేస్తున్నా. నేనున్న స్థాయిలో పరుగులు మీద పరుగులు తీస్తూ ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం లేదు’ అంటూ చలోక్తితో సమాధానాలిస్తోంది అనుష్క. గత మూడేళ్లలో సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్, ఫిల్లౌరి, జబ్ హారీ మెట్ సెజల్, పరి, సంజు, సూరుూధాగా లాంటి చిత్రాల్లో అందమైన, బరువైన పాత్రల్ని పోషించి వరుస హిట్లు అందుకుంది అనుష్క. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పాత్రకు కొత్త జీవం పోయగలనటిగా ప్రశంసలూ అందుకుంది. అయితే, గత ఏడాది చేసిన ‘జీరో’ మాత్రం అనుష్క కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బ. ‘జీరో’ తరువాత ఆమె ఏ ప్రాజెక్టుకూ సైన్ చేయలేదు కూడా. ‘జీరో’ వైఫల్యం కారణంగానే ప్రాజెక్టులకు దూరంగా ఉంటున్నారా? అన్న మీడియా ప్రశ్నకు ‘నాకు సినిమా ఫ్యాషన్. అది నెరవేర్చుకోడానికి గత మూడేళ్లూ కఠోర శ్రమ చేశా. చాలెంజింగ్ పాత్రల్ని ఎంపిక చేసుకుని, వాటితో మెప్పించానన్న సంతృప్తి ఉంది. నటిగా నేనేంటో ప్రూవ్ చేసుకున్నాననే అనుకుంటున్నా. వాస్తవానికి ‘జీరో’లాంటి పాత్ర చేయడం ఆషామాషీ కాదు. ఆ పాత్రలో నాకు సంతృప్తే కలిగింది. నేనున్న స్థాయిలో టైం టు టైం ప్రాజెక్టులు చేయడానికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు’ అంటోంది. అంతేకాదు ‘ఆన్‌స్క్రీన్‌కు ఒకింత దూరంగావున్నా -తెరవెనుక ఆసక్తికరమైన ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్నా’నని కూడా చెప్తోంది. ‘నిర్మాతగా చేతినిండా పనుంది. నిర్మాతగా నేనో ప్రాజెక్టు చేస్తున్న విషయం ప్రజలకు తెలీకపోవచ్చు. కానీ, ఆ ప్రాజెక్టుకు సమయాన్ని కేటాయించాలి’ అంటోంది అనుష్క. ‘ఇప్పటి వరకూ ఎంపిక చేసుకున్న, పోషించిన పాత్రలతో నటిగా సంతృప్తితో ఉన్నాను. కెరీర్‌ను మరింత ముందుకు నడిపించేందుకు వైవిధ్యమైన పాత్రల ఎంపికైనే దృష్టిపెడుతున్నా’ అంటోంది అనుష్క శర్మ.