సైరా.. అప్పుడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీగా తెరకెక్కుతున్న సినిమా -సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోకాపేటలో భారీ సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే సెట్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తెలిసిందే. దాన్ని త్వరగా పునరుద్ధరించి అందులో షూటింగ్ నిర్వహిస్తున్నారట. ఈ షెడ్యూల్‌తో సినిమా టాకీపార్ట్ పూర్తికానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా జోరుగా జరుపుతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైందన్న వార్త వినిపిస్తోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సైరా థియేటర్లకు రావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. రామ్‌చరణ్ నిర్మాతగా సైరా 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమా విడుదల చేయనున్నారు. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న సినిమా అత్యంత భారీస్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.