క్రీడా నేపథ్యంలో మిస్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటగదరా శివ ఫేమ్ ఉదయ్‌శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్‌ఎల్‌పి -‘మిస్ మ్యాచ్’ పేరిట తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. తమిళనాట హీరో విజయ్ ఆంటోనీతో ‘సలీం’ను తెరకెక్కించిన ఎన్‌వి నిర్మల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా తొలి ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’ విడుదల చేశారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ నిర్మల్ మేకింగ్ సలీంతోనే అర్థమైంది. ఈ సినిమా అంతకన్నా ఎక్కువ హిట్ అవ్వాలని ఆశిస్తున్నా. ఇక కథా రచయిత భూపతిరాజా ముఠామేస్ర్తీనుండి ఇప్పటి సైరా నర్సింహారెడ్డి వరకు ఆయన రాసిన సినిమాలు చూస్తున్నాం. హీరో ఉదయ్‌శంకర్, కథానాయకి ఐశ్వర్యరాజేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాకి పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ శుభాకాంక్షలు అన్నారు. మాటల రచయిత రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ‘ఇది ఒక అచ్చమైన, స్వచ్ఛమైన ప్రేమకథ. ఒక బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం, కంచెలాంటి సినిమాల స్థాయిలో నిర్మించడం జరుగుతుంది. సినిమా రష్ చూస్తేనే అర్థమవుతోంది, ఏ స్థాయిలో ఉంటుందోనని. మంచి చిత్రాన్ని అంతా ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ స్క్రిప్ట్ విన్నప్పుడే నచ్చి పక్కాగా చేద్దామనిపించింది. అనుకున్నట్టుగానే స్క్రిప్ట్‌పరంగా సినిమా బాగావస్తోంది అన్నారు. మాటల రచయిత మధు, నిర్మాతలు జి. శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్ మాట్లాడుతూ మా అందరికీ గురువు. మేము నమ్మే వ్యిక్తి శ్రీరామ్. ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన అబ్బాయే హీరో ఉదయ్‌శంకర్. ఈ సినిమా మంచి సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నాం అన్నారు.