క్రేజీ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో నయనతార తరువాత ఆ రేంజ్‌లో సినిమాలతో ఫుల్ బిజీగా వుంది యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఏడాదికి అరడజనుకు పైగా సినిమాలు చేస్తుంది ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో మూడు సినిమాలతో అలాగే తమిళంలో రెండు సినిమాలతో బిజీగా వుంది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ 16వ చిత్రంలో ఐశ్వర్య హీరోయిన్‌గా నటించనుంది. పాండిరాజ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్‌గా కనిపించనుండగా సూరి, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది.