జూన్ 15 నుంచి మహేష్ @ 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి భారీ అంచనాలమధ్య నిన్న విడుదలైన మహర్షి భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఓపెనింగ్స్ అయితే భారీగానే వచ్చాయి కానీ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఓవర్‌సీస్‌లోకూడా ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో వసూళ్లపై భారీగానే ప్రభావం పడేలా ఉంది. మహర్షి సినిమా విడుదలైంది కాబట్టి నెక్స్ట్ ఫోకస్ ఆయన 26వ సినిమాపై పెట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా జూన్ 15 నుండి సెట్స్‌పైకి రానుందట. లేటెస్ట్‌గా ఎఫ్2 లాంటి హిలేరియస్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమానుకూడా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ కూడా పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలన్న ఆలోచనలో భాగంగా అనిల్ చెప్పిన కథకు మహేష్ ఓకె చెప్పాడు. పక్కా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాతో మాజీ హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది. విజయశాంతి ఇందులో మహేష్ అత్త పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రమ్యకృష్ణ మహేష్‌కు తల్లిగా కనిపిస్తుందట. అంటే అత్త, తల్లి పాత్రల మధ్య సాండ్‌విచ్ అయ్యే పాత్రలో మహేష్ కనిపిస్తాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని జూన్ 15న ప్రారంభించి అదే రోజున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. ఏకధాటిగా షూటింగ్ జరిపి వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రాన్ని అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. త్వరలో అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.