వచ్చే నెల 19న కాంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముని, కాంచన, కాంచన 2తో హారర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ సక్సెస్‌తోపాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ముని సిరీస్ నుంచి వస్తున్న హారర్ కామెడీ కాంచన 3. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇటీవల కాంచన 3 విడుదల చేసిన మొదటి లుక్ మోషన్ పోస్టర్ ఒక మాసివ్ వేవ్‌ను తీసుకొచ్చింది. అటు సినీ ప్రేక్షకులనుండి ఇటు సామాన్య ప్రేక్షకుడు నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మోషన్ పోస్టర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టర్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో మొట్టమొదటిసారిగా డాల్బి అట్మాస్ సౌండ్‌తో ఈ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత బి.మధు విడుదల చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్ 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల చేయనున్నారు. అతి త్వరలో వచ్చే ట్రైలర్ ఈ అంచనాలను త్రిబుల్ చేయనుందని యూనిట్ అంటున్నారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ కాంచన 3 నా కెరీర్‌కే ప్రత్యేకమైంది. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. సినిమాకోసం ఎన్నడూ లేనివిధంగా 220 రోజులపాటు వర్క్ చేశాం. తమన్ అద్భుతమైన రీరికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇందులో నా గెటప్‌కు చాలా మంచి పేరొచ్చింది. ఏప్రిల్ 19న విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో బి.మధు విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.