సెట్స్‌పైకి జూలైనుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రక నేపథ్యమున్న చిత్రంగా చిరంజీవి తాజా సినిమా ‘సైరా’ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. భారీ సెట్స్‌లో ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తిచేశారు. సైరా పూర్తయితేగానీ, కొరటాలతో చిరు ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు లేవు. కొరటాలతో చిరు చేయబోయే ప్రాజెక్టు కథ ఏమైవుంటుందా? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. తాజా సమాచారం ప్రకారం సైరా షూటింగ్ జూన్‌తో పూర్తవుతుందట. తరువాతి నెల నుంచి అంటే జూలై నుంచి కొరటాల ప్రాజెక్టు సైట్స్‌పైకి వెళ్లొచ్చన్నది లేటెస్ట్ టాక్. ఇప్పటికే చిరంజీవితో పలుదఫాలు భేటీ అయిన దర్శకుడు కొరటాల -ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చేశాడంటున్నారు. జూలైలో కనుక షూటింగ్ మొదలైతే ఎక్కడా గ్యాప్‌లేకుండా డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసేయాలన్నది కొరటాల్ ప్లాన్. కొత్త ప్రాజెక్టులో చిరంజీవిది ద్విపాత్రాభినయమని, ఒక కథానాయికగా శృతిహాసన్‌ను ఎంపిక చేశారన్న కథనాలూ వినిపిస్తున్నాయి.