కోడి రామకృష్ణకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా రామకృష్ణను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చినట్టు సమాచారం అందుతోంది. మధ్యతరగతి జీవితాలను కథా వస్తువులు చేసుకుని తెలుగు సాంఘిక సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిన దర్శక ఘనాపాటీల్లో కోడి రామకృష్ణది ప్రత్యేక స్థానం. ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ మధ్యతరగతి జీవితాలు, ఆ బతుకుల్లోని ఎత్తుపల్లాలను కథా వస్తువులు చేసుకుని ఎక్కువ చిత్రాలు నిర్మించారు. సాంఘిక చిత్రాలు చేస్తూనే -అకస్మాత్తుగా ‘అమ్మోరు’లాంటి ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించి తనదైన శైలిలో ఆడియన్స్‌ను భయబ్రాంతులు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఆ పరంపరలో భాగంగా తెరకెక్కించిన మరో ఫాంటసీ చిత్రమే -అరుంధతి. ఈ సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభకు అద్దంపట్టింది. దర్శకుడిగా టాలీవుడ్‌లో కొంతకాలం తన శకాన్ని నడిపించిన కోడి రామకృష్ణ ఇప్పుడు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పక్షవాతానికి గురైన కోడి రామకృష్ణ కొంతకాలం చికిత్స తీసుకుని కోలుకున్నారు. కోడి రామకృష్ణ త్వరగా కోలుకోవాలని పరిశ్రమ కోరుకుంటోంది.