రెడీ అయిన కంచు అల్లుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘మామ మంచు అల్లుడు కంచు’.
ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన పాటలు మంచి ప్రజాదరణ పొందాయని నిర్మాత తెలిపాడు. అప్పట్లో మోహన్‌బాబు, రమ్యకృష్ణ, మీనాల కాంబినేషన్‌కు ఎంత క్రేజ్ వుందో అందరికీ తెలిసిందే. చాలా కాలం తరువాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో వస్తున్న హాస్య ప్రధాన చిత్రం ఇది. అల్లరి నరేష్ సరసన పూర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సందేశ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మోహన్‌బాబు పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు. మరోవైపు అల్లరి నరేష్ తన కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కుతోంది. నరేష్ ఇతర చిత్రాలకు బిన్నంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమైంది.