బాలీవుడ్‌లో క్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవి శేషు, అదాశర్మ, అనసూయ ముఖ్యపాత్రల్లో నటించిన ‘క్షణం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్‌ని సొంతం చేసుకుంది.
చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. నూతన దర్శకుడు రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొంది విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలు హిందీలో సంచలన విజయాలు అందుకున్నాయి. ఆ కోవలోనే ఈ సినిమా హిందీలోకి వెళ్లనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ నడయడ్‌వాలా ఈ రీమేక్ హక్కులను తీసుకున్నాడు. హిందీలో ప్రముఖ హీరోతో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.
chitram...
‘క్షణం’లో అనసూయ