హిట్ పెయిర్‌కు మరో ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, అవికాగోర్‌ల జంట తెలుగు తెరపై సందడి చేసి రెండు వరుస విజయాలని అందుకున్న విషయం తెలిసిందే. ‘ఉయ్యాల జంపాల’తో ప్రారంభమైన ఈ కాంబినేషన్‌కు సినిమా చూపిస్తమావ కమర్షియల్‌గా మంచి బ్రేక్‌నిచ్చింది. ఈ జోడీకి ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో మరోసారి జోడీ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌లు హీరోలుగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మించే చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. పంజాబీ చిత్రానికి రీమేక్‌గా రూపొందే ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌కి జోడీగా అవికాగోర్ నటిస్తుండగా, మంచువిష్ణుకు జోడీగా ‘అనేకుడు’ ఫేం అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

చిత్రం... రాజ్‌తరుణ్
అవికాగోర్