ఆర్య ‘సామ్రాజ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.వి.ఎస్. క్రియేషన్స్ పతాకంపై ఆర్య, కీర్తి జంటగా చరణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామ్రాజ్యం’. ఈ చిత్రాన్ని నైనాల సాయిరామ్ తెలుగులో అందిస్తున్నారు. తమిళంలో విజయవంతం అయిన ఈ చిత్రం తెలుగులో కూడా అందరికీ నచ్చుతుందని నిర్మాత తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ప్రతి మనిషి పుట్టుకకు ఓ కారణం వుంటుందని, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నించే నేపథ్యంలో హీరో ఏం చేశాడు అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని అన్నారు. హీరో ఎవరితో, ఎలా పోరాడాడు అనే ఆసక్తికరమైన కథ, కథనంతో సాగే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఐదు పాటలు, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ ఈ చిత్రానికి హైలెట్ అవుతాయని, త్వరలో ఆడియో విడుదల జరుపుతామని ఆయన అన్నారు. నాజర్, నెపోలియన్, అదిశయ, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:్భరద్వాజ్, పాటలు:శివగణేశ్, బాలవర్థన్, హరిదాస్, మాటలు:రాజశేఖర్‌రెడ్డి, నిర్మాత:నైనాల సాయిరామ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:చరణ్.