రివాల్వర్ రాణిగా రాణించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గుంటూర్ టాకీస్ చిత్రంలో చేసిన పాత్ర ఇప్పటివరకూ నేను ఏ సినిమాలోనూ చేయలేదు. రివాల్వర్ రాణిగా నిజమైన గన్స్ పట్టుకొని నటిస్తూ, తుపాకి పేలిస్తే ముఖం మీదికి స్పార్కల్స్ వచ్చేవి’ అని నటి శ్రద్ధాదాస్ తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ, రేష్మీగౌతమ్, శ్రద్ధాదాస్ ప్రధాన తారాగణంగా ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం.రాజ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘గుంటూర్ టాకీస్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక శ్రద్ధాదాస్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..
* రివాల్వర్ రాణిగా నా జీవితంలో ఈ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని భావిస్తాను. ఆడియన్స్ కూడా ఈ పాత్ర చూడగానే ఆశ్చర్యపోతారు. ఓ రకంగా కంగనారౌనత్‌లా కనిపిస్తాను. ఇది నాకు ఛాలెంజింగ్ రోలే. రెండు వైవిధ్యమైన షేడ్స్ వున్న ఫుల్‌లెంగ్త్ పాత్రలో నటించడం ఆనందంగా వుంది.
* ఈ సినిమా అంతా కన్‌ఫ్యూజన్, కామెడీ నేపధ్యంలో సాగుతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడు అవడంతో నేను ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాను. రివాల్వర్ రాణిగా నటించాలంటే కొన్ని గట్స్ వుండాలి. సహజంగా ఏ సినిమాలో అయినా అమ్మాయిని అబ్బాయి కిడ్నాప్ చేస్తే, నేను ఈ చిత్రంలో అబ్బాయిని కిడ్నాప్ చేస్తా.
*నేను పాత్ర చేయగలనా అని దర్శకుడిని ముందే అడిగా. ఎందుకంటే ఆ పాత్రను ప్రేక్షకులు చూశాక నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం కలిగింది. అలా కాకుండా శ్రద్ధాదాస్ ఇలాంటి పాత్రలో కూడా చేయగలదు అనే విధంగా నటించా. ఎక్కడా అతిగా మాత్రం ఉండదు.
* నాకు ఒక మంచి పాత్ర వచ్చిందా లేదా అనేదే చూస్తాను. ఇమేజ్ గురించి పెద్దగా ఆలోచించను. ఈ సినిమాలో నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. సినిమా చూస్తే మీకు నవ్వొస్తుంది.
* ఇప్పటికే అనేక చిత్రాల్లో గ్లామర్ పాత్రల్లో నటించాను. ఎప్పుడూ అలాంటి పాత్రల్లో నటిస్తుంటే బోర్‌కొట్టేస్తుంది కదా? అందుకే ఈ సినిమాలో డిఫరెంట్ యాంగిల్‌లో చేయడానికి ప్రయత్నించాను. ఈ పాత్ర కూడా గ్లామరస్‌గానే ఉంటుంది.
* ఐటెమ్‌గర్ల్‌గా నటించాలని ఏమాత్రం ఉండదు. కానీ టింగో టింగో తర్వాత నాలుగైదు అవకాశాలు వచ్చాయి. కానీ ఒప్పుకోలేదు. అలా అని ఐటెమ్‌పాటలకు దూరం అని కాదు మంచి హీరో, మంచి చిత్రం అయితే ఖచ్చితంగా చేస్తాను.
* ప్రస్తుతం హిందీలో గ్రేట్ గ్రాండ్ మస్తీ, కన్నడ బెంగాలీ చిత్రాలతోపాటుగా తెలుగులో కూడా నటిస్తున్నాను. వైవిధ్యమైన పలు పాత్రలు అనేక భాషల్లో చేస్తున్నాను. కెరీర్ పరంగా చాలా సంతోషంగా ఉన్నాను.

- ఎస్