పోలీస్ ఆఫీసర్ పాత్ర సంతృప్తినిచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలో మొదటినుండి సామాజిక స్పృహ వున్న వ్యక్తి పాత్రలో నటించడంతో ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యారని, 25 సంవత్సరాలు క్రితం ‘ఎన్‌కౌంటర్’ చిత్రంలో నక్సలైట్ లీడర్‌గా నటించిన నేను, ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించడం ఆనందాన్నిస్తోందని నటుడు శ్రీకాంత్ తెలిపారు. అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్, నిఖిత జంటగా సతీష్‌కాశెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ రూపొందించిన ‘టెర్రర్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ పలు విశేషాలు తెలుపుతూ.. ‘టెర్రర్’ సినిమా అన్ని కేంద్రాల్లో విజయవంతం కావడం ఆనందదాయకమని, ఒక మంచి కానె్సప్ట్‌తో సినిమా చేస్తే ప్రేక్షకులు విజయవంతం చేస్తారని, ఈ సినిమా మరోసారి నిరూపించిందని, చాలాకాలం తర్వాత ఓ మంచి సినిమా చేశానన్న తృప్తి కలిగిందని తెలిపారు. అన్ని కేంద్రాలలో థియేటర్లు పెరిగాయని ఆయన అన్నారు. నిర్మాత ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందించడంతో ఇంత మంచి విజయం సాధ్యం అయిందని, శ్రీకాంత్ హీరోయిజం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారిందని, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని దర్శకుడు సతీష్‌కాశెట్టి తెలిపారు. తన తొలి సినిమాకే ఇంత ఆదరణ రావడం ఆనందంగా వుందని, లక్ష్మీభూపాల్ మాటలు, సాయికార్తిక్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచాయని, విజయోత్సవ టూర్లను తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నామని నిర్మాత షేక్ మస్తాన్ అన్నారు. కార్యక్రమంలో నటుడు రవివర్మ, ప్రియదర్శి, ముస్త్ఫా, లక్ష్మీభూపాల్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.