11న ఓ స్ర్తి రేపురా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశిష్‌గాంధీ, దీక్షాపంత్ ప్రధాన తారాగణంగా రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో అశోక్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’ (కల్పితమా ఖచ్చితమా). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 11న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు ఊళ్ళో దయ్యం ఒకటి తిరుగుతుందన్న భయంతో ప్రతీ ఇంటి గోడపైన ఓ స్ర్తి రేపురా అని రాసేవారని, కొన్ని ఊర్లలో ఆ భయంతో గ్రామాలను విడిచిపెట్టి వెళ్లిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. అటువంటి కథాంశాన్ని తీసుకొని హారర్ థ్రిల్లర్‌గా వైవిధ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఘంటసాల విశ్వనాథ్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని, ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ సాంగ్‌కు మంచి ఆదరణ లభించిందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. వంశీకృష్ణ కొండూరి, కునాల్ కౌశిక్, శృతిమోల్, మనాలీ రాథోడ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వైవాహర్ష, స్వప్నిక, షాన్, వీరబాబు, శ్యామ్‌సుందర్, సోనాల్, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి, ఎడిటింగ్: రామాంజనేయరెడ్డి,
కెమెరా: సిద్ధం మనోహర్, దేవర హరినాథ్, పాటలు: సుభాష్ నారాయణ్, పవన్ రాచేపల్లి, కథ, నిర్మాత, దర్శకత్వం: అశోక్‌రెడ్డి.