పాటలు పాడుతున్న పంతులుగారి అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ అజయ్, శ్రావ్య జంటగా హెచ్.ఎస్.సహన దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రాన్ని ‘పంతులుగారి అమ్మాయి’ పేరుతో విడుదల చేస్తున్నారు. చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సీనియర్ దర్శకుడు సాగర్ సీడీలను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ,‘ ట్రైలర్స్, సాంగ్స్ బాగున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వుంది.’ అన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిర్మాతలు తెలుగులో స్ట్రయిట్ సినిమాలు చేయాలన్నారు. నిర్మాత వరప్రసాద్ మాట్లాడుతూ, ఇది కన్నడంలో ఘన విజయం సాధించడంతో తెలుగులో రిలీజ్ చేస్తుమని, సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన దీన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: శ్రీమతి వెల్లంకి విజయలక్ష్మి, సహ నిర్మాతలు: అందాల రాజేశ్వరి, ముద్దం రామచంద్రుడు, నిర్మాత: వరప్రసాద్, దర్శకత్వం: సహన హెచ్.ఎస్.