గ్లామర్ డోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై తొలి సినిమాతోనే మంచి హిట్‌తోపాటు గుర్తింపును సంపాదించుకున్న మెహ్రిన్ ఇప్పుడు టాలీవుడ్‌లో జోరు పెంచింది. ప్రస్తుతం పలు అవకాశాలతో జోరుమీదున్న ఈ భామ మంచి సినిమాల్లో ఛాన్స్ వస్తే గ్లామర్‌గా కూడా కనిపించేందుకు సై అంటోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ డోస్ పెంచక తప్పదనే భావిస్తున్నట్టుంది. మడికట్టుకు కూర్చుంటే కొన్ని సినిమాలకే పరిమితమయ్యే ప్రమాదం లేకపోలేదని పసిగట్టినట్టుంది. అందుకే ఇకపై చేసే సినిమాల్లో పాత్ర పరిధి మేరకు గ్లామర్‌గా కనిపించేందుకు రెడీ అంటోందట. దాంతోపాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కూడా నటిస్తానని చెబుతోంది. ఇప్పటికే రెండు క్రేజీ సినిమాల్లో హీరోయిన్‌గా ఓకే అయినట్టు తెలిసింది. మొత్తానికి తొందర్లోనే మార్కెట్ గుట్టు తెలుసుకుందీ భామ.