లింగుస్వామితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘సరైనోడు’తో బిజీగా వున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత వెంటనే సినిమాలు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరైనోడు ఏప్రిల్ 22న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత తదుపరి చిత్రాలకోసం కథలు వింటున్న అల్లు అర్జున్ లేటెస్ట్‌గా ఓ చిత్రాన్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. తమిళంలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. తమిళంలో పందెంకోడి వంటి సినిమాతో కమర్షియల్ దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న లింగుస్వామి చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అల్లు అర్జున్. ప్రస్తుతం పందెంకోడి చిత్రానికి సీక్వెల్ చేయడానికి రెడీ అయిన లింగుస్వామి అల్లుఅర్జున్ సినిమా ఓకే అనడంతో దాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.