చివరి షెడ్యూల్‌లో కింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినయ్‌రాయ్, స్వస్తిక, సాక్షి చౌదరి హీరో, హీరోయన్లుగా తమిళ దర్శకుడు శరన్ దర్శకత్వంలో ఆర్.కె.్ఫలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ నిర్మిస్తున్న కింగ్స్ చిత్రం మార్చి 3నుంచి చివరి షెడ్యూల్ జరుపుకోనుందని నిర్మాత చెప్పారు. ‘ఇటీవలే బ్యాంకాక్, మారిషస్‌లలో రెండు పాటలు, కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాం. మార్చి 3నుంచి హైదరాబాద్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. సూర్యగ్రహణానికి ముందు పుట్టిన ఇద్దరు కవల పిల్లల కథ ఇది. వారి మధ్య ప్రతిక్షణం పోటీ నడుస్తుంది. ఈ అంశాన్ని తీసుకుని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. సూర్య, విక్రమ్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన శరన్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది.’ అన్నారు. ‘తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గంతో వెళ్లి ఇటీవల ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీతో చర్చలు జరిపాం. ప్రతి థియేటర్‌లో 5 షోలు వేయాలని, అందులో నూన్ షో చిన్న సినిమాకు కేటాయించాలని కోరాం. దానికి ప్రభుత్వం పాజిటివ్‌గానే స్పందించింది. చిన్న సినిమాలకు లోబడ్జెట్‌కు లోబడి 35 థియేటర్ల కెపాసిటీ వరకే ఉండేది. ఇప్పుడు దాన్ని 100 థియేటర్లకు పెంచమన్నాం. ప్రభుత్వ స్థలాల్లో థియేటర్లు నిర్మించాలని సూచించాం. చిన్న సినిమాలకు టాక్స్‌ఫ్రీ ఇవ్వాలని అడిగాం. కొంతమంది టెక్నీషియన్లకు ఇంకా సొంత ఇళ్లు లేవు. వారికి చిత్రపురి కాలనీలోనే మరో పది ఎకరాల్లో కట్టించమని అడిగాం. చిన్న సినిమాకు 15 లక్షల సబ్సిడీ కావాలని సూచించాం. మేమిచ్చిన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది.’ అని ఆయన వివరించారు.