ముస్తాబవుతున్న అరకు రోడ్‌లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరామ్‌శంకర్, నిఖిషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో సురేష్‌వర్మ, బాబులు నిర్మిస్తున్న అరకురోడ్‌లో చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం షూటింగ్ లొకేషన్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో సాయిరామ్‌శంకర్ మాట్లాడుతూ, ‘రెండురోజులుగా పబ్‌లో షూటింగ్ జరుపుతున్నాం. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కే ఈ సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది. కమర్షియల్ అంశాలతో తెరకెక్కే ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’- అన్నారు. హీరోయిన్ నిఖిషాపటేల్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలోని పాత్ర నాకు బాగా నచ్చింది. సాయిరామ్ శంకర్ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడు’- అన్నారు. దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ, ‘ఇది థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే కథ. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ట్రైలర్‌కు వచ్చినట్లే సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అన్నారు. నటుడు అభిమన్యుసింగ్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో ఇది మరో బెస్ట్‌రోల్ అవుతుందన్నారు. నిర్మాత సురేష్‌వర్మ మాట్లాడుతూ, అన్నిరకాల కమర్షియల్ అంశాలున్నా ఈ సినిమా మంచి థ్రిల్లర్ కథతో రూపొందుతోందని, ఏప్రిల్ చివర్లో విడుదలచేస్తామన్నారు.