తెలుగులో ముంజానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో విజయవంతమైన ముంజానీ చిత్రాన్ని తెలుగులో జర్నీ-2గా విడుదల చేస్తున్నారు. గణేష్, మంజరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై చిగులూరి గంగాధర్‌రావు చౌదరి అందిస్తున్నారు. ఎస్.నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరని అన్నారు. ఒకరినొకరు చూసుకోకుండానే ఓ అబ్బాయి, ఓ అమ్మాయి గాఢ ప్రేమికులుగా మారి, చివరికి ఎలా కలుసుకోగలిగారన్న సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా కన్నడంలో ఈ చిత్రం విడుదలై విజయఢంకా మ్రోగించిందని తెలిపారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేశామని, తప్పక తెలుగు ప్రజలకు నచ్చుతుందన్న నమ్మకం వుందని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెనె్నలకంటి, పాటలు: వెనె్నలకంటి, ఎడిటింగ్: ఇ.ఎమ్.నాగేశ్వరరావు, నిర్మాత: చిగులూరి గంగాధరరావు చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్.నారాయణ.