ట్రెండ్‌కు తగ్గట్టే మనమూ మారాలి -- హీరో శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండస్ట్రీలోకి వచ్చి ఇనే్నళ్లయినా ఇంకా సముద్రం మధ్యలోనే ఈదుతున్నట్టుంది, సాధించాల్సింది చాలా వుంది అని అంటున్నాడు నటుడు శ్రీకాంత్. ఆయన హీరోగా సత్యం ద్వారపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీడికి దూకుడెక్కువ’. కామ్నాజఠ్మలానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈనెల 4న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు..
సినిమాపై నమ్మకం
నేను పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. ఇదివరకు నేను నటించిన పోలీస్ పాత్రలకు భిన్నంగా వుంటుంది. సినిమా బాగా రిచ్‌గా వచ్చింది. నిర్మాత రామకృష్ణారెడ్డి కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మళ్లీ ఈ సినిమాతో నా కెరీర్ పుంజుకుంటుందని భావిస్తున్నాను.
ట్రెండ్ మారింది
ఈమధ్య నాకు సక్సెస్ రావడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. దాని గురించి నేనెప్పుడూ బాధపడను. ప్రస్తుతం ట్రెండ్ మారింది. దానికి తగ్గట్టుగానే సినిమాలు వస్తున్నాయి. ఐతే ఆ సినిమాలను ఎంచుకోవడంలో నేను విఫలమవుతున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడు కుటుంబ కథాచిత్రాల శైలి కూడా మారింది. ముఖ్యంగా సినిమాలు భారీగా రూపొందుతున్నాయి.
హీరోయిన్‌లదే హవా
ఇంతకుముందు సినిమాల్లో హీరోయిన్లు అందరు హీరోలతో కలిసి నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హీరోయిన్లు ఒక సర్కిల్‌లోనే తిరుగుతున్నారు. దాంతోపాటు మనకున్నది చాలా తక్కువమంది హీరోయిన్లు. కొత్తవాళ్లని పెట్టుకుంటే అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు. ప్రస్తుతం హీరోయిన్లు సహకరించడం లేదని చెప్పాలి.
అన్నీ అలాంటివే
ఈమధ్య నాకొస్తున్న కథలన్నీ పోలీస్ నేపథ్యంతో ఉంటున్నవే. వద్దని చెబితే ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి. కాబట్టి వచ్చిన సినిమాల్ని చేస్తున్నాను.
చేయాల్సింది ఇంకా వుంది
పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్లయింది. ఇప్పటికి 116 సినిమాల్లో నటించాను. ఇనే్నళ్లయినా ఇంకా సముద్రం మధ్యలో ఈదుతున్నట్టే వుంది. ఒడ్డుకు చేరాలంటే చేయాల్సింది ఇంకా వుంది.
వాడింకా పిల్లాడే
మా అబ్బాయి ఇటీవలే ‘రుద్రమదేవి’ సినిమాలో నటించాడు. హీరోగా ‘నిర్మలా కానె్వంట్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పదో తరగతికి చెందిన కథతో రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత సినిమాలు చేస్తాడేమో.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం నేను నటించిన 3 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా వున్నాయి. దాంతోపాటు అమ్మారాజశేఖర్ దర్శకత్వంలో ఓ హారర్ సినిమా నిర్మిస్తున్నాను. షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరిలో విడుదల చేస్తాం. ఇంకా దానికి టైటిల్ నిర్ణయించలేదు. ఇకపై సెలక్టివ్‌గా కథల్ని ఎంచుకుని ముందుకెళ్లాలని ఫిక్సయ్యా.

- శ్రీ