పూర్తికావస్తున్న నాకు ఇంకోపేరుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైకా ప్రొడక్షన్స్ సంస్థ జి.వి.ప్రకాష్‌కుమార్ కథానాయకుడుగా శామ్‌ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నాకు ఇంకోపేరుంది’. ఈ చిత్రానికి సంబంధించిన 40 రోజుల షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా జి.వి.ప్రకాష్ మాట్లాడుతూ యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రం తామనుకున్నదానికన్నా బాగా వస్తోందని, రజనీకాంత్ గతంలో చేసిన ఓ సూపర్‌హిట్ చిత్రంలోని డైలాగ్‌నే ఈ చిత్రానికి పేరుగా నిర్ణయించామని, ఈ పేరుకు యువత నుండి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. జానీగా నటించే తాను ఈ చిత్రంలో సరికొత్తగా నటించడానికి ప్రయత్నించానని, త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఓ అందమైన కథనంతో రూపొందే ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయని, స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగుతుందని ఆయన తెలిపారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కృష్ణవసంత్, ఎడిటింగ్:రూబెన్, సంగీతం: జి.వి.ప్రకాష్, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, కథ, దర్శకత్వం: శ్యామ్ ఆంటోన్.