నీరజ త్యాగం చూసి.. ఇందులో నటించా-- సోనమ్‌కపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన యువనటి సోనమ్ కపూర్ ‘నీరజ’ సినిమాకు ‘హిట్’ టాక్ రావడంతో ఇపుడు ఆనందలోకంలో విహరిస్తోంది. 359 మంది విమాన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సాహసవనిత నీరజా బానోత్ జీవితకథ ఆధారంగా తీసిన ఈ సినిమాలో తాను కష్టపడి నటించానని ఆమె చెబుతోంది. అవార్డు వస్తుందన్న ఆశతో కాకుండా, నీరజ పాత్ర తనను ఎంతగానో కదిలించడంతో చేశానని సోనమ్ తెలిపింది. నీరజలా కనిపించేందుకు ఆమె బంధువులను కలుసుకుని, అనేక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని వివరించింది. సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ముంబయిలో ఆమె మాట్లాడుతూ, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన నీరజ గొప్పదనాన్ని నటన ద్వారా ఆవిష్కరించేందుకు ఎంతో కసరత్తు చేశానని వివరించింది. తాను నటించిన తొలి బయోపిక్ ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ఊహించలేదని, కలెక్షన్ల పరంగానూ సినిమా ముందుకు దూసుకువెళుతోందని ఆమె అంటోంది.
పుంజుకుంటున్న కలెక్షన్లు..
విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ బాగుండంతో ‘నీరజ’కు మొదటి మూడు రోజుల్లో కలెక్షన్లు అనూహ్యంగా పెరిగాయి. ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా మంచి టాక్ రావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకున్నాయి. తొలిరోజు 4.7 కోట్లు, రెండోరోజు 7.6 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ సినిమాకు ఆదివారం నాటికి మరింత జనాదరణ పెరిగింది. ఆదివారం నాటికి 20 కోట్ల రూపాయలకు మించి కలెక్షన్లు నమోదవుతాయని సినీ పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి.