కలసిరావట్లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇలియానాకు బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చిందో గానీ అక్కడ మాత్రం ఎన్ని కష్టాలుపడ్డా ఈ భామకు కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి తీరుగానే వుంది. అవకాశాలు అందిపుచ్చుకున్నా కూడా సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో మళ్లీ తన హవా చాటుకోవాలని హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లతో రెచ్చగొట్టినా కూడా లాభం లేకపోయింది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ సరసన ఒకే ఒక్క చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఈమధ్య సోషల్ మీడియాతో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో రెగ్యులర్‌గా ఫొటోలు పెడుతూ ఎంజాయ్ చేస్తోంది. మరి ఈమధ్య పెట్టిన కొన్ని ఫొటోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏదేమైనా ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం సరైన అవకాశాల్ని అందిపుచ్చుకోలేక డీలాపడిపోయింది ఈ గోవా భామ!