నాగార్జునతో బంగార్రాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంక్రాంతి పండక్కి సోగ్గాడిగా వచ్చిన నాగార్జున మంచి విజయాన్ని అందుకుని
జోరుమీదున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి
విజయాన్ని అందుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటించిన నాగార్జునకు బంగార్రాజు పాత్ర బాగా నచ్చింది. దాంతో బంగార్రాజు పాత్రను ప్రధానంగా
చేసుకుని మరో చిత్రం చేయడానికి ఆసక్తిగా వున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్‌కృష్ణతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బంగార్రాజు పాత్ర తెలుగు ప్రేక్షకులకు
బాగా నచ్చింది. అందుకని ఇలాంటి నేపథ్యంతో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడు.
ఈ కథ ఓకె అయితే వచ్చే సంక్రాంతికి మరో బంగార్రాజు సిద్ధమైనట్టే!