22న విశాల్ కథకళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో ఆకట్టుకునే చిత్రాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో విశాల్. తాజాగా ‘కథకళి’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఇప్పుడు తమిళనాట థియేటర్లలో హల్‌చల్ చేస్తోంది. ‘పసంగ’, ‘పసంగ 2’ చిత్రాలతో తమిళనాడు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాండిరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న తమిళనాట విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విశాల్ సరసన రెజీనా, క్యాథరిన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిఫరెంట్ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో అక్కడి ప్రేక్షకులను బాగానే మెప్పిస్తోంది. మరోవైపు విశాల్‌కు తెలుగులో ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో అనువదించారు. ఇక తమిళంతోపాటు కథకళి తెలుగు వెర్షన్‌నూ సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రయత్నించినా, తెలుగులో బడా సినిమాల మధ్య భారీ పోటీ ఉండడంతో వారంపాటు వాయిదావేశారు. జనవరి 22న తెలుగులో ‘కథకళి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించారు.