కొత్తకొత్తగా టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర్, అక్షిత, కిమాయ ప్రధాన తారాగణంగా శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పతాకంపై సతీష్ గుండేటి దర్శకత్వంలో పెర్లా ప్రభాకర్, తోట గోపాల్ రూపొందించిన చిత్రం ‘కొత్త కొత్తగా వున్నది’.
ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు టీజర్‌ను విడుదల చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని, దక్షిణాదిన హైదరాబాద్ హబ్‌గా మారడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాలన్నీ మంచి ఆదరణ పొందుతున్నాయని, ఈ చిత్రం కూడా ఈ సంవత్సరంలో విడుదల కానుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పెళ్లికి ముందు ప్రేమికులకు సంబంధించిన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఫిబ్రవరిలో జరగనున్నదని దర్శకుడు సతీష్ గుండేటి తెలిపారు. కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సమర్, కిమాయ, నిర్మాత తెర్లా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ గుండేటి.