మెగా హీరోతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే వచ్చిన ‘నేను..శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ కీర్తి సురేష్. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. ఈ సినిమా తరువాత ఇపుడు కీర్తి సురేష్‌కు టాలీవుడ్‌లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మెగా హీరో సరసన ఆమె నటింబోతోందని తెలుస్తోంది. రామ్‌చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే తమిళ సూపర్‌హిట్ రీమేక్ ‘తని ఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈమెతో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా చేసేందుకు కీర్తి అంగీకరించిందని అంటున్నారు. ఈ సినిమా తరువాత కీర్తి తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారడంలో ఎలాంటి సందేహం లేదు.